జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చినప్పుడు పవన్ ఇంట్లో దాక్కుంటే ప్రాణాలు లెక్కచేయకుండా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారని ఆయన గుర్తుచేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు రూ.300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడని ఎమ్మెల్యే అన్నారు. పవన్‌కు దమ్ముంటే సింగిల్‌గా పోటి చేయాలని బాలనాగిరెడ్డి సవాల్ విసిరారు. వాలంటీర్లు, మహిళలను ఉద్దేశించి పవన్ చేసే విమర్శలు మంచిది కాదని.. ఆయన ముందు మాట్లాడటం నేర్చుకోవాలని బాలనాగిరెడ్డి చురకలంటించారు.
కరోనా వచ్చినప్పుడు పవన్ ఇంట్లో దాక్కుంటే ప్రాణాలు లెక్కచేయకుండా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు గురించి మాట్లాడితే పడే వర్షాలు కూడా ఆగిపోతాయని.. ఇక లోకేష్ అడుగుపెట్టగానే మా జిల్లాలో వర్షాలు వెనక్కిపోయాయని బాలనాగిరెడ్డి దుయ్యబట్టారు. లోకేష్‌ది చంద్రబాబును మించిన ఐరన్ లెగ్ అంటూ ఆయన సెటైర్లు వేశారు.
ఇదిలావుండగా.. మంత్రి రోజా మంగళవారం.. పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విమెన్ ట్రాఫికింగ్ అని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వివరించారు. ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యను ఒక మహిళగా తాను ఎంతమాత్రం సహించబోనని స్పష్టం చేశారు.
ALso Read: పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ, పది ప్రశ్రలు సంధించిన వాలంటీర్లు.. సమాధానం చెప్పాలంటూ డిమాండ్..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు తాము ఓడిపోతామనే విషయం బోధపడిందని అర్థం అవుతున్నట్టు రోజా పేర్కొన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను సాధారణ ప్రజలకు నేరుగా అందిస్తున్నారని, దీని వల్ల వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నదని, ఇలా సామాన్య ప్రజల గుండెల్లోనూ వైసీపీ ముద్రపడటాన్ని పవన్ జీర్ణించుకోవడం లేదని విమర్శించారు.
మహిళలన్నా, వాలంటీర్లన్నా పవన్ కళ్యాణ్‌కు గౌరవం లేదని, వారిని అపకీర్తిపాలు చేసేలా మాట్లాడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని నిఘా వర్గాలు చెప్పాయని ఇక్కడ కారుకూతులు కూస్తున్నారని రోజా మండిపడ్డారు. నిజానికి ఎన్సీఆర్బీ డేటాలో మహిళల అక్రమ రవాణా విషయంలో టాప్ టెన్‌లో ఆంధ్రప్రదేశ్ లేదని అన్నారు. తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ వెళ్లి కేసీఆర్‌ను నిలదీసే దమ్ము పవన్ కళ్యాణ్‌కు ఉన్నదా? అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్ముందా? ఒక వేళ మాట్లాడితే నీ మక్కెలిరగ్గొడతారనే భయం పవన్ కళ్యాణ్‌కు ఉన్నదని వివరించారు. హైదరాబాద్‌లో తాను బతకలేనని భయంతోనే అక్కడ మాట్లాడవని ఆరోపించారు.
