వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు.  ఉండవల్లి కరకట్ట వెంబడివున్న అక్రమ కట్టడాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కారణంగా కరకట్టలు బలహీనపడుతున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని.. అందుకే ఫర్నీచర్, కారు తరలించారని ఆర్కే విమర్శించారు.

బాబు ఇంట్లోకి వరద నీరు రావడంతోనే ఇసుక మూటలు వేస్తున్నారని రామృష్ణారెడ్డి ఎద్దేవా  చేశారు. చంద్రబాబు  బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్కే స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలను చేపడుతున్న అధికారులను అడ్డుకోవడం  సరికాదని ఆయన  హితవు పలికారు.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లొ పొడివాతావరణం వుంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నా  ప్రజలు ఉక్కపోతతో  అల్లాడుతున్నారు. రెండు  రోజుల పాటు ఇదే పరిస్ధితి వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.