తన కేబినెట్‌లో బెర్త్ దొరక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కరిగా సంతృప్తిపరుస్తున్నారు.

బుధవారం నగరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించిన జగన్ తాజాగా మరో సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఫోకస్ పెట్టారు. ఆయనను సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో జారీ కానున్నాయి.