Asianet News TeluguAsianet News Telugu

చెన్నై పేపర్‌లో చూసి గుంటూరోళ్లు వేలానికి వెళ్లారట: ఆర్కే సెటైర్లు

సదావర్తి భూముల వ్యవహారంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు.

mangalagiri mla alla ramakrishna reddy speech on sadavarti satram lands
Author
Amaravathi, First Published Jul 16, 2019, 11:34 AM IST

సదావర్తి భూముల వ్యవహారంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ఘాటుగా స్పందించారు.

దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అమ్మాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని బాబు ప్రభుత్వం జీవో నెం. 424 విడుదల చేసిందని.. కానీ కొద్దిరోజులకే జీవో నెం.13ను విడుదల చేసి భూములు అమ్ముకోవచ్చునని చెప్పిందని గుర్తుచేశారు.

భూముల వేలానికి సంబంధించి ఈ టెండర్ పిలవాలన్నారు. చెన్నైకి చెందిన చిన్న లోకల్ పేపర్‌లో వచ్చిన ప్రకటన చూసి.. గుంటూరుకు చెందిన బాబు బినామీలు తమిళనాడుకు వెళ్లి వేలంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం నిర్దేశించిన రూ. 50 లక్షల ధర కంటే తక్కువగా కేవలం రూ. 27 లక్షలకే పాటను కొట్టేశారని ఆర్కే దుయ్యబట్టారు.  దీనిపై భ్రమరాంబ అనే ఉద్యోగి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆమెను చంద్రబాబు సర్కార్ ట్రాన్స్‌ఫర్ చేసిందని ఆర్కే గుర్తు చేశారు.

దీనిపైనే తాను న్యాయస్థానానికి వెళ్లానని ఆయన వెల్లడించారు. సదావర్తిభూములపై దేవాదాయశాఖ మంత్రిని కోరుతున్నట్లుగా రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవుళ్లు, దేవాదాయ శాఖ భూములంటే లెక్కలేదని.. దీనిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు.

అనంతరం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు సదావర్తికి రాసిచ్చారన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూముల యాజమాన్య హక్కులపై ఏపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. భూమి విలువ గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీని వేసిందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios