ప్రపంచంలోనే ఎత్తైన కృష్ణ మందిరం రూ. 700 కోట్లతో 700 అడుగుల ఎత్తైన మందిరం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ మందిరం ఢిల్లీలో నిర్మితమవుతోంది. మందిరం ఎత్తు 700 అడుగులు. దాదాపు 700 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ మందిరంలో సుమారు ఒకేసారి 5 వేల మంది భక్తులు ప్రార్ధన చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకునేలా ఈ మందిరాన్ని ఇస్కాన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ మందిరం ఉండే ప్రాంగణానికి నిర్వాహకులు బృందావనం అని పేరు పెట్టారు. ఈ మందిరం చుట్టూ చక్కటి పచ్కిక బయళ్ళు, తోటలతో అలరారేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 సంవత్సరంలో మందిరాన్ని ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. మందిరం నిర్మాణ పురోగతిని త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వచ్చి చూడనున్నట్లు సమాచారం.
