వైసీపీ అధినేత జగన్ పై సినీ హీరో మంచు విష్ణు భార్య వెరోనికా.. షాకింగ్ కామెంట్స్ చేశారు. వెరోనికా.. జగన్ కి దగ్గరి బంధువు అన్న విషయం అందిరకీ తెలిసిందే. జగన్ కి వరసకు సోదరి కూడా అవుతంది. 

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. మంచు ఫ్యామిలీకి.. టీడీపీకి బహిరంగంగానే వార్ జరుగుతోంది.  జగన్ కి మద్దతు ఇవ్వడానికే టీడీపీపై బురద జల్లుతున్నారనేది టీడీపీ వాదన.

మీ బంధువైన వైఎస్ జగన్‌కు మేలు చేసేలా ఎన్నికల సమయంలో ఈ ఆందోళన ఎందుకు చేపట్టారు. ముసుగు తీసేసి వైసీపీ తరపున ప్రచారం చేసుకుంటే మిమ్మల్ని ఆపేదెవరు. మోహన్‌బాబు వారం రోజులుగా చెవిరెడ్డి అనే క్రిమిన‌ల్‌తో తిరుపతిలో తిరుగుతున్నారు’ అంటూ ఓ టీడీపీ నేత చేసిన కామెంట్స పై వెరోనికా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతిస్తున్నానని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అసలు నేనెందుకు మద్దతివ్వకూడదు? ఒకవేళ మీకు దీనిపై స్పష్టత లేకపోతే, మీకు కొన్ని విషయాలు చెబుతాను. వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం. ఇక నా విషయానికి వస్తే, నాకెప్పుడూ నా కుటుంబమే తొలి ప్రాధాన్యత’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.