ఓ మహిళ తన చెల్లెలి కాపురం సరిద్దిదాలని అనుకుంది. భర్తతో తరచూ గొడవ పడుతూ.. నానా ఇబ్బందలు పడుతున్న చెల్లెలిని చూసి ఆమె మనసు చెలించిపోయింది. చెల్లెలి భర్తతో మాట్లాడి పరిస్థితి చక్కబెట్టాలని అనుకుంది. కానీ ఆమె మంచి మనసుని చెల్లెలి భర్త అర్థం చేసుకోలేకపోయాడు. పైగా ఆమె పై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను లారీతో తొక్కించాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు కొరిటెపాడుకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి డోకిపర్రు ప్రాంత సమీపంలోని క్వారీలో గ్రావెల్ మట్టి తోడుతుంటాడు. అయితే.. గత కొంతకాలంగా వీరేంద్ర తన భార్య మేరీ తో తరచూ గొడవ పడుతున్నాడు. తన భర్త తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. మేరీ.. తన అక్క మీరాబి వద్ద గోడు వెల్లబోసుకుంది.

దీంతో.. మరిది వీరేంద్రకు నచ్చచెప్పి.. చెల్లెలి కాపురం సరిదిద్దాలని మీరాబి భావించింది. ఈ క్రమంలోనే చెల్లెలు మీరాతో కలిసి వీరేంద్ర పనిచేసే వద్దకు వెళ్లింది. అయితే.. భార్యతో పాటు వదినను చూసిన వీరేంద్ర కోపంతో ఊగిపోయాడు. వెంటనే వదిన అని కూడా చూడకుండా.. ఆమెను లారీతో తొక్కించాడు. అనంతరం అక్కడి నుంచి పారరయ్యాడు. 

కాగా.. లారీ కింద పడటంతో.. మీరాబి రెండు కాళ్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.