శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి పెరుగుతున్నా.....చంద్రుడి మీదకు రెండోసారి జైత్రయాత్ర చేసే స్థాయికి భారతదేశం వచ్చినా దేశంలో మూడ నమ్మకాలు మాత్రం పోవడం లేదు. తాజాగా కొడుక్కి ఎంతగా వెతుకుతున్న మంచి సంబంధం దొరక్కపోవడంతో ఓ వ్యక్తి.. తంత్రాలు, మంత్రాలను నమ్ముకున్నాడు.

వివరాల్లోకి వెళితూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టనానికి చెందిన ఆలయ పూజారి రాంపల్లి శేషసాయి కుమారుడు శివదుర్గాప్రసాద్‌కు వివాహం కావడం లేదు. దీంతో బండారులంకకు చెందిన జిలగం వీరముక్తి లింగేశ్వరరావు సిద్ధాంతిని ఆశ్రయించారు.

దీంతో ఆయన అరటి చెట్టుతో ముందుగా కుమారుడికి వివాహ జరిపిస్తే ఆ తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరుగుతుందని చెప్పారు. దీంతో సిద్ధాంతికి చెందిన తోటలోనే బుధవారం రాత్రి పూజకు ఏర్పాట్లు చేశారు.

అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అరటి తోట వద్ద మంత్రాలు వినిపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షుద్రపూజలు చేస్తున్నారని భావించి  వారిని చుట్టుముట్టారు.

దీంతో తాము తమ కుమారుడి పెళ్లి గురించి పూజ చేయిస్తున్నామని.. అంతేకాని క్షుద్రపూజలు చేయడం లేదని శేషసాయి స్థానికులతో చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు తండ్రీకొడుకులతో పాటు సిద్ధాంతి, మరో నలుగురిని అదుపులో తీసుకున్నారు.