ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం పులివెందులలో దారుణం జరిగింది. పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి సంబంధించిన విషయాలు తెలియరాలేదు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. సీఎం సొంతవూరు కావడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.