పీకలదాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్న విచక్షణ కోల్పోయాడు. తాగిన మందు మత్తు నషాలానికి ఎత్తడంతో..  పరాయి స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తమ ఇంటి ఆడపిల్లతోనే అసభ్యంగా ప్రవర్తిస్తావా అంటూ ఆ మహిళ కుటుంబసభ్యులు చితకబాదారు. ఆదెబ్బలు తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని చోడవరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చోడవరం మండలం రాజాం గ్రామానికి చెందిన ఏరువాక సన్యాసి నాయుడు(36) కి తాగే అలవాటు ఉంది. రోజూమాదిరిగానే ఆదివారం మధ్యాహ్నాం పీలకదాకా మద్యం సేవించాడు. ఆ మత్తులో వరసకు మేనకోడలు అయ్యే యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు.  అతని భారి నుంచి తప్పించుకున్న యువతి  ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేసింది.

దీంతో కోపంతో ఊగిపోయిన యువతి కుటుంబస్యులు సన్యాసి నాయుడు భార్య కన్నమ్మతో ఈ విషయంలో గొడవ పడ్డారు. వారికి సర్ధిచెప్పి ఇంటికి పంపించింది కన్నమ్మ. ఆమె సర్దిచెప్పినప్పటికీ వారి సన్యాసి నాయుడు మీద కోపం పోలేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతనిని పట్టుకొని చచ్చేదాక కొట్టారు. ఐదుగురు కలిసి దారుణంగా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ క్రమంలో అతని తలకు దెబ్బ తగిలింది. దీంతో తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే కన్నుమూశాడు.

ఆస్పత్రికి తరలిద్దామని చూసే లోపు అతను చనిపోయి ఉన్నాడు. దీంతో సన్యాసి నాయుడు భార్య, అతని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని అక్కడి నుంచి తీయమంటూ బైఠాయించి కూర్చొని ఆందోళన  చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సన్యాసినాయుడు పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.