ఆమెకు గతంలో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల భర్త చనిపోవడంతో.. తానే కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా.. కొంత కాలం క్రితం ఆమెకు ఓ ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ ఆనందంగా గడుపుతూ ఉండేవారు. అయితే.. రూ.3వేలు వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఆ డబ్బు కోసమే ఆటో డ్రైవర్.. సదరు మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 7వ తేదీన సాయంత్రం పెదవేగి మండలం మొండూరు సమీపంలోని పోలవరం కుడి కాలువ గట్టు కింద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే.. సదరు మహిళ చనిపోయి అప్పటికే పది రోజులు కావొస్తుందని పోలీసుల దర్యాప్తులో తేంది.

అప్పటికే ఆమె మృతదేహం కళ్లిపోయిన రీతిలో కనిపించడంతో.. చనిపోయింది ఎవరూ అనే విషయం కూడా సాధ్యపడలేదు. తర్వాత పోలీసులు చాలా తెలివిగా వ్యవహరించింది. చనిపోయిన మహిళ దెందులూరు మండలం అక్కిరెడ్డి గూడేనికి చెందిన జానపూడి అనూష(30) గా గుర్తించారు.

ఆమె భర్త చనిపోగా.. ముగ్గురు పిల్లలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. కాగా.. ఆమెకు కొంత కాలం క్రితం సందీప్ అనే ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే.. ఇటీవల అనూష.. తన ప్రియుడు సందీప్ వద్ద రూ.3వేలు అప్పు తీసుకుంది.

వారం రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పింది. కానీ.. రోజులు గడుస్తున్నా.. అవి తిరిగి ఇవ్వలేదు. ఈ క్రమంలో.. ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపం తట్టుకోలేక సందీప్ ఆమెను గట్టిగా కొట్టాడు. అనంతరం ఆమె మెడకు చున్నీ వేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని పొలాల గట్టుమీదకు విసిరేసి వెళ్లిపోయాడు. కాగా.. ఆమె ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. కాగా.. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.