Asianet News TeluguAsianet News Telugu

కుటుంబం పరువు తీసిందని.. కొడుకు లేని సమయంలో.. కోడలిని చంపిన మామ..!

సువర్ణమ్మ పలు మార్లు మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నతో ఘర్షణ పడి చెప్పుతో కొట్టడం, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ పరువు తీసిందని భావించి సువర్ణమ్మను మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. 

Man Kills Daughter in law With help of son In Kurnool
Author
Hyderabad, First Published Nov 2, 2021, 10:18 AM IST

తరచూ తమను కించ పరుస్తూ.. తమ కుటుంబం పరువు తీసిందని.. ఓ వ్యక్తి  కొడుకు లేని సమయంలో.. కోడలిని చంపేశాడు. పెద్ద కోడలిని  చంపేందుకు.. తన చిన్న కొడుకు సహాయం తీసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం  చింతకుంట గ్రామంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Also read: గంజాయి వెనుక నక్సల్స్‌ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చింతకుంట గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వన్నప్పకు పదేళ్ల క్రితం అర్థగేరి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(30) తో వివాహం జరిగింది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. కాగా.. వీరికి గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి.

Also Read:ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..

ఈ నేపథ్యంలో.. సువర్ణమ్మ పలు మార్లు మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నతో ఘర్షణ పడి చెప్పుతో కొట్టడం, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ పరువు తీసిందని భావించి సువర్ణమ్మను మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. అక్టోబర్‌ 15వ తేదీన దసరా పండుగ రోజు వన్నప్ప బన్ని ఉత్సవానికి దేవరగట్టుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ ఎర్రిస్వామి, మరుదులు సుంకన్న, బ్రహ్మయ్య, హనమంతు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సువర్ణను గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కర్ణాటకలోని మోకా వద్ద వీరాపురం రైల్వే ట్రాక్‌పై పడేశారు.

మరుసటి రోజు సువర్ణమ్మ కనిపించడం లేదని భర్త వన్నప్ప, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మూడు రోజుల తర్వాత రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని శవం వెలుగులోకి రావడంతో హత్య చేసి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వన్నప్ప కూడా తన తండ్రి, తమ్ముళ్లపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరుచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios