గంజాయి వెనుక నక్సల్స్ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ
ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం..అని Gautam Sawang తెలిపారు.
అమరావతి : ముంద్రా పోర్టు డ్రగ్స్‌కు, ఏపీకి సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీలో డ్రగ్స్ లేవని, కేవలం గంజాయి సాగు మాత్రమే జరుగుతోందని తెలిపారు.
‘‘గంజాయి నివారణకు 7 రాష్ట్రాల అధికారులతో చర్చించాం. ఈ భేటీలో డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. గంజాయి నివారణకు ప్రణాళికబద్ధంగా ముందుకెళుతున్నాం. cannabis సమూల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
పూర్తి నిఘాతో గంజాయిని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సాగు నుంచి రవాణా వరకు సమగ్ర నివేదిక తయారుచేస్తున్నాం. గంజాయి సాగు, రవాణా వెనుక Naxals పాత్ర ఎక్కువగా ఉంది. అది వారి ఆదాయ వనరుగా మారింది. ఏవోబీలో ఎప్పటి నుంచో గంజాయి సాగు జరుగుతోంది.
ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం’’ అని Gautam Sawang తెలిపారు.
నార్కోటిక్స్ హబ్‌గా ఏపీ...
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ నార్కోటిక్స్ హబ్‌గా మారిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోందని మండిపడ్డారు.
ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ తెలంగాణ పోలీసులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన పోరాట యాత్ర సమయంలో ఏవోబీలో గంజాయి వ్యాపారం, మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. వరసు ట్వీట్‌లతో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
‘ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది & ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు’ అని పవన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన మాటలు చూడండి అంటూ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఎస్పీ రంగనాథ్ మాట్లాడూత.. గంజాయి AOB ప్రాంతం నుంచి దేశంలోని చాలా ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. అది వేల కోట్ల బిజినెస్ అని తెలిపారు.
మరో ట్వీట్‌లో పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వీడియోను షేర్ చేశారు. ‘హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీ అంజనీ కుమార్.. ఏపీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు ఎలా రవాణా చేయబడుతున్నాయో వివరాలను తెలియజేస్తున్నారు’అని పేర్కొన్నారు.
2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి పోరాట యాత్రను చెప్పటినట్టు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగం, అక్రమ మైనింగ్, గంజాయి వ్యాపారం, గంజాయి మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదు వచ్చాయని జనసేనాని తెలిపారు.