ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది.
Also read: అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం.. రైతుల పాదయాత్రకు చంద్రబాబు మద్దతు
అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
Also read: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్...
ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీలివే..
కుప్పం, బుచ్చిరెడ్డి పాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బేతంచర్ల, కమలాపురం
దీంతో ఏపీలో మరోసారి ఎన్నికల వేడి కొనసాగనుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచి జరిగిన.. స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌ల ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసింది. ప్రతిపక్ష టీడీపీ ఘోర పరాభావాన్ని మూటగట్టకుంది. అయితే ఈ ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. దీనికి ఆ పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. అయితే అశోక్ గజపతి రాజు వంటి కొందరు నేతలు ఈ నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా మిగిలిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌కు షెడ్యూల్‌లు విడుదలైన నేపథ్యంలో టీడీపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.