Asianet News TeluguAsianet News Telugu

దారుణం : భర్తను ముక్కలు చేసి.. బాత్రూంలో పాతిపెట్టి...

చిత్తూరు జిల్లా, పలమనేరులో నెల రోజుల కిందట జరిగిన హత్య శుక్రవారం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. భర్తను భార్య, ఆమె సోదరుడు కలిసి చంపేశారని విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్తను అతిదారుణంగా చంపడమే కాకుండా శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

Man kills brother-in-law for harassing his sister in Palamaner of Chittoor - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 10:37 AM IST

చిత్తూరు జిల్లా, పలమనేరులో నెల రోజుల కిందట జరిగిన హత్య శుక్రవారం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. భర్తను భార్య, ఆమె సోదరుడు కలిసి చంపేశారని విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భర్తను అతిదారుణంగా చంపడమే కాకుండా శవాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

హతుడు పలమనేరు మండలం పందేరుపల్లె వడ్డూరు కు చెందిన పసల నాగరాజు కాగా ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు డిఎస్పి గంగయ్య శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఆయన కథనం మేరకు పసల నాగరాజు, భాగ్యలక్ష్మి కూలి పనులు చేసి జీవించేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న బంగారుపాలెం మండలం అండరెడ్డిపల్లెకు చెందిన పసల గోపి తన తమ్ముడు నాగరాజు 13 రోజులుగా కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం భాగ్యలక్ష్మికి వరుసకు సోదరుడు, మండలంలోని క్యాటిల్ ఫామ్ కు చెందిన నవీన్ తానే నాగరాజును హత్య చేసినట్టు వీఆర్వో సిద్దేశ్వర్ ముందు లొంగిపోయాడు.

బావమరిది వరసైన నవీన్ కు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు నాగరాజు నిరాకరించాడు. అంతేకాక అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. ఈ నేపథ్యంలో భర్తను చంపాలని నవీన్ ద్వారా ఆమె స్కెచ్ వేసింది. గత నెల 12వ తేదీ రాత్రి ఇంట్లో నాగరాజు మద్యం మత్తులో ఉండగా, నవీన్ వెళ్లి అతడి తలపై బండరాయితో మోది చంపేశాడు.

తనతో తీసుకెళ్లిన కత్తితో మొండెం, కాళ్లు, చేతులు, శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. ఆ తరువాత బాత్రూం గుంతలో పూడ్చి పెట్టాడు. సైకిల్ పై తిరిగి స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన సీఐ జయరామయ్య, ఎస్ఐలు నాగరాజు, ప్రియాంక, వెంకటసుబ్బమ్మ, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios