Asianet News TeluguAsianet News Telugu

భార్య చనిపోయిందని చేరదీస్తే.. వదినతో తమ్ముడి అక్రమసంబంధం.. తట్టుకోలేక ఆ అన్న చేసిన పని....

భార్య చనిపోయిందని తమ్ముడిని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నాడు ఓ అన్న. కానీ ఆ తమ్ముడు మాత్రం వదినతో సంబంధం పెట్టుకుని అన్నకే వెన్నుపోటు పొడిచాడు. 

man extramarital affair with brother wife murdered in tirupati
Author
First Published Sep 12, 2022, 12:03 PM IST

తిరుపతి : తిరుపతి చిల్లకూరులో దారుణ ఘటన వెలుగు చూసింది.  వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. ఇలాంటి అక్రమసంబంధాలు... క్షణికావేశంలో చేసే తప్పులతో.. వాటిని సరిదిద్దుకోవడాని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతిలో జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని.. అన్న కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన చిల్లకూరు మండలం కాకువారిపాలెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దేపల్లి బాలాజీ, ప్రతాప్ (25)  అన్నదమ్ములు.  

ఇద్దరికీ వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. పది నెలల క్రితం ప్రతాప్ భార్య.. కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో ఒంటరి అయిన తమ్ముడిని.. అలా వదిలేయడం ఎందుకని అన్న బాలాజీ చేరదీసి.. తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చాడు. అయితే తమ్ముడు మాత్రం అన్న మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నాడు. వదినతో చనువుగా ఉంటూ వచ్చాడు. వదినామరుదులు మాట్లాడుకోవడం సహజమే అనుకున్నాడు అన్న. అయితే తమ్ముడు ప్రతాప్ ఆమెతో అక్రమ సంబంధంపెట్టుకున్నాడు. అది అన్న గమనించలేదు.  

విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం: అసెంబ్లీలో కేసీఆర్

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రతాప్, తన వదిన ఒకే దగ్గర ఉండటం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడయ్యాడు. పక్కనే ఉన్న కర్రతో తమ్ముడి మీద దాడి చేశాడు. దీంతో తమ్ముడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూర్ రూరల్ సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ గోపాల్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఓ మహిళను 15 మంది కలిసి కిడ్నాప్ చేశారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు గేటు బద్దలు కొట్టి మరీ మహిళను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను పట్టుకుని మహిళను కాపాడారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మైలాడుతురైలో నివసించే ఓ యువతి (24)తో నిందితుల్లో ఒకరైన విఘ్నీశ్వరన్ కు కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో విఘ్నీశ్వరన్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు.  

దీంతో,  బాధితురాలు..  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆ తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా,  అనంతరం.. వ్రాతపూర్వకంగా లేఖ రాయించుకుని విగ్నేశ్వరన్ ను విడుదల చేశారు. ఈ క్రమంలో బయటికి వచ్చిన విఘ్నేశ్వరన్.. యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో నిందితుడు మరో 14 మందితో కలిసి మహిళను కిడ్నాప్ చేశారు. 14మంది కలిపి ఆమె ఇంటి గేటును బద్దలు కొట్టి మరీ.. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కిడ్నాప్ చేశారు. కారులో ఆమెను సిటీ దాటిస్తుండగా రంగంలోకి దిగిన పోలీసులు.. వెంబడించి హైవేపై వారిని పట్టుకున్నారు. ఆమెను విడిపించి.. ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు 

Follow Us:
Download App:
  • android
  • ios