Asianet News TeluguAsianet News Telugu

భార్యను వదిలిపెట్టి... మరదలితో తిరుపతి పారిపోయి.. అంతలోనే ఉరేసుకుని ఆత్మహత్య..

వారికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా.. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. యేడాది కాలంగా వీరి మధ్య family disputes ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అతను భార్య చెల్లి అయిన మరదలితో love affair మొదలుపెట్టాడు. 
 

man eloped with sister-in-law attempted suicide in tirupati
Author
Hyderabad, First Published Oct 29, 2021, 8:25 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తిరుపతి : భార్యను వదిలిపెట్టి ప్రేమ పేరుతో మరదలితో తిరుపతికి వచ్చిన యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు వివరాల మేరకు.. హైదరాబాద్ నగరం చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన సాయి నవీన్ (26)కు నాలుగేళ్ల కిందట కూకట్ పల్లి జేఎన్ టీ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం అయ్యింది. 

వారికి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా.. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది. యేడాది కాలంగా వీరి మధ్య family disputes ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అతను భార్య చెల్లి అయిన మరదలితో love affair మొదలుపెట్టాడు. 

విషయం తెలుసుకున్న భార్య, వారి కుటుంబసభ్యులు సొంతైరైన గుడివాడకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని సాయి నవీన్ బెదిరించడంతో అందరూ హైదరాబాద్ కు చేరుున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఈ క్రమంలో sai naveen మరదలికి మాయమాటలు చెప్పి మూడు రోజులు కిందట tirupati తీసుకువచ్చాడు. స్థానికంగా ఉన్న ఓ lodge లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పెళ్లి చేసుకుందాం అని సాయి నవీన్ అనడంతో.. అక్కకు అన్యాయం చేసి పెళ్లి చేసుకోలేనని sister-in-law బుధవారం రాత్రి   sleeping pills మింగింది. 

ఇది చూసిన సాయి నవీన్ బెంబేలెత్తిపోయాడు. ఆమెను కాపాడాల్సింది పోయి.. గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని suicide చేసుకున్నాడు. అయితే, అనుమానంతో గదిలో తనిఖీ చేసిన లాడ్జి సిబ్బంది వీరిద్దరినీ గమనించారు. అప్పటికే సాయి నవీన్ చనిపోయాడు. 

మరదలిని ఆస్పత్రిలో చేర్పించగా..గురువారం ఉదయానికి ఆమె కోలుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పెద్దల్ని కాదని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. ఇంటికి వచ్చి ఫ్యాన్ కు ఉరేసుకుని నవదంపతుల దారుణం...

ప్రేమించి పెళ్లిచేసుకుని.. ఫ్యాన్ కు ఉరేసుకుని...
ఇదిలా ఉండగా.. తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్ (29),  రుంకు దివ్య (20)  కొంతకాలంగా ప్రేమించుకున్నారు.  ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఉద్దేశంతో వారిని కాదని ఇటీవల స్నేహితుల సమక్షంలో అన్నవరం ఆలయంలో marriage చేసుకున్నారు.  ఆ తరువాత స్వగ్రామానికి రాకుండా విశాఖపట్నంలోనే కాపురం పెట్టారు.  

పెళ్లైన దాదాపు రెండు నెలలకు.. తల్లిదండ్రులను చూసొద్దామని ఇద్దరూ సంతోషంగా బుధవారం గ్రామం లో అడుగుపెట్టారు.  పెళ్లి అయి చాలా రోజులు కావడంతో  కోపతాపాలు మరిచిపోతారని, అంత ఆదరిస్తారని భావించారు.  తప్పు చేశాను అమ్మ అంటూ తల్లి ని పట్టుకుని హరీష్ ఏడ్చేశాడు. లేని బిడ్డ అని ముద్దుగా చూసుకున్న ఆ తల్లి కుమారుడిని ఓదార్చి ఇంట్లోకి తీసుకువెళ్ళింది.

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పై అంతస్తులోకి వెళ్లారు.  ఫోన్ కింది అంతస్తులో ఉండిపోవడంతో దాన్ని తీసుకుని వెళ్ళిన ఒక యువకుడు ఇద్దరూ రెండు ఫ్యాన్లు hang చేసుకుని ఉన్న విషయాన్ని గమనించి కేకలు వేశాడు.  వెళ్లి చూసేసరికి ఇద్దరు విగతజీవులుగా కనిపించారు.

ఎంసీఏ చదివిన హరీష్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. విశాఖలో శిక్షణ తీసుకుంటున్నాడు.  డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది.  యాభై రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కానీ వీరి బలవన్మరణానికి కారణం అంతుపట్టడం లేదు పాలకొండ సీఐ శంకరరావు, రేగిడి ఎస్సై మహమ్మద్ అలీ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios