తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. కొవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్టులు చేపడుతున్న సంజీవిని బస్సు వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే 108కు ఫోన్ చేయగా గంట తర్వాత రావడంతో రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని హాస్పిటల్ కు వచ్చే లోపు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. 

అయితే కొడుకు చనిపోయిన విషయం తెలియక శవాన్ని కదుపుతూ మృతుడి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారికీ కంటతడి పెట్టించింది. ఆ తండ్రి అమాయకంగా బిడ్డ ఒళ్లు పడుతూ, ఛాతీని ఒత్తుతూ బ్రతికించుకునే ప్రయత్నం చేయడం చూసి చూసేవారికే ఎంతో బాధ కలిగించింది.   

వీడియో

"

తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన శేఖర్(32) గత మూడు రోజులుగా ఒళ్లు నొప్పిలు, జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా రుయా ఎమర్జెన్సీకి వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టెస్టు ఎక్కడ చేస్తారో కూడా తమకు చెప్పేవారు కరవయ్యారని శేఖర్ తండ్రి వాపోయాడు. ఎలాగోలా కరోనా టెస్టు చేసే సంజీవిని బస్సువద్దకు వెళ్లగా అక్కడే  కుప్పకూలి అతడు మృతిచెందాడు.