ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తాను మంత్రి తమ్ముడినంటూ హంగామా సృష్టించాడు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి తాను మంత్రి తమ్ముడినంటూ హంగామా సృష్టించాడు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తమ్ముడిని అంటూ ఓ వ్యక్తి ఏలూరులో పలువురి నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేరుతో ఉన్న స్టిక్కర్‌ను కారుకు అంటించుకుని హల్‌చల్ చేయసాగాడు. ఈ క్రమంలోనే శ్యామూల్ అనే వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే తన నుండి కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో శ్యామ్యూల్.. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని దొంగల శ్రీధర్‌గా గుర్తించారు. అతడిని అరెస్ట్ కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. శ్రీధర్‌పై గతంలో కూడా వివిధ జిల్లాల్లో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అతనిపై రౌడీషీట్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు.