వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విశాఖపట్నంజిల్లాలో సంచలనం రేకెత్తించింది. బుధవారం ఉదయం ఓ వ్యక్తి నడి బజారులో అందరూ చూస్తుండగానే తన ఒంటిపై పెట్రోలు పోసుకుని తనకు తానే నిప్పు పెట్టేసుకున్నాడు.  ఇంతకీ విషయం ఏమిటంటే పెందుర్తి పోలిస్ స్టేషన్ ఎదురుగా మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి మనస్తాపంతో పెట్రోలు పోసుకుని అత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈయన గతంలో తన భార్యను క్రికెట్ బాట్ తో కొట్టి  చంపాడు. ఆ కేసు దర్యాప్తు లో ఉండగానే భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పెందుర్తి  పోలిసులు ఘటనా స్ధలానికి చేరుకుని 108 లో కేజీహెచ్ కి తరలించారు.