ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించిన భార్య.. చిన్న గొడవకే ఆత్మహత్య చేసుకోవడం అతనిని కలచివేసింది. భార్య పోయిన బాధ తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య  చేసుకున్నాడు. 

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో.. భర్త మీద కోపంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించిన భార్య.. చిన్న గొడవకే ఆత్మహత్య చేసుకోవడం అతనిని కలచివేసింది. భార్య పోయిన బాధ తట్టుకోలేక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుడివాడలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు కి చెందిన శ్రీకాంత్(27) .. అదే ప్రాంతానికి చెందిన అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత చిన్నపాటి మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ లో అనూష ఆత్మహత్య చేసుకుంది. భార్య భౌతికంగా దూరమైనా మానసికంగా అతని నుంచి దూరం చేయలేకపోయారు. దీంతో భార్యను మర్చిపోలేక రోజు ఆమె దుస్తులు పట్టుకొని ఏడ్చేవాడు. ఈ క్రమంలో భార్య చున్నీతోనే ఉరివేసుకొని ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.