తిరుమలలో పనిచేసే నిఘా అధికారులకు బుద్ధి రావటం లేదు. ఎన్నిసార్లు వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నా దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవటం లేదు. టిటిడిలో పోస్టింగులే రాజకీయ నేతల ఒత్తిళ్ళు, సిఫారసుల కారణంగా జరుగుతుండటంతో ఏ అదికారిపైనా ఎవ్వరూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇదంతా ఎందుకంటే, తిరుమలలో పట్టపగలే అపచారం జరిగినా అరికట్టే వారు లేకపోయారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అపచారం జరుగుతూనే ఉన్నా అధికారుకు పట్టడంలేదు.

మంగళవారం మాడ వీధుల్లో మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి కెమెరాకు చిక్కాడు. వరాహస్వామి ఆలయం సమీపంలో ఉన్న కల్వర్టులో కూర్చుని పక్కన మద్యం సీసా, చెప్పులతో ఓ వ్యక్తి కనిపించాడు. తిరుమలలో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉంటాయి. అయినా టీటీడీ సిబ్బంది కాని, విజిలెన్స్‌ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇలా పదేపదే స్వామి వారి సన్నిధిలో అపచారం జరుగుతున్నా ఎవరికీ పట్టక పోవటమే ఆశ్చర్యంగా ఉంది.