మొదటి భార్యను వరకట్న వేధింపులకు గురిచేసి.. తీరా తల్లిగారింటికి వెళ్లాక.. రెండో పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు.. విషయం తెలుసుకున్న ఆ భార్య మెరుపుదాడి చేసి.. పెళ్లిని అడ్డుకుంది. అంతేకాదు.. అంతకుముందు రెండు సార్లు ఇలాగే చేశాడంటూ.. పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లింది.
పెనుగంచిప్రోలు : wifeకు తెలియకుండా husband రెండో పెళ్లి చేసుకుంటుండగా.. భార్య అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన ఆదివారం Penuganchiproluలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన చెరుకుమల్లి మధుబాబుకు హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింటివారు Dowry harassmentకు పాల్పడుతుండడంతో గత మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ మేరకు భువనగిరి పోలీస్ స్టేషన్ సరిత కేసు పెట్టగా.. కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మధుబాబు గతంలో రెండు సార్లు వివాహం చేసుకోగా సరిత అడ్డుకుంది. ఈసారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించుకుని.. వివాహం చేసుకునేందుకు ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చాడు. ఆలయంలో పెద్ద తిరునాళ్ల కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. బేడా మండపంలో వివాహ తంతు జరుగుతుండగా ... సరిత, ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా పెళ్లి కుమారుడుగా ఉన్న మధుబాబుపై మెరుపుదాడి చేసి వివాహాన్ని అడ్డుకున్నారు.
గతంలో జరిగిన వివాహం గురించి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధుబాబునను పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. తర్జనభర్జనల అనంతరం ఇప్పటికే భువనగిరి పోలీస్ స్టేషన్లో కేసు విచారణలో ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరం లేదని వెళ్లిపోయినట్లు ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు.
ఇలాంటి ఓ కేసులో జనవరి 18న దుబాయ్ కోర్టు ఓ విచిత్రమైన తీర్పునిచ్చింది. couple మధ్య రెండో పెళ్లి విషయమై జరిగిన గొడవ కాస్తా కోర్టుకెక్కింది. దాంతో Dubai Court దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తయిన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. dubaiలో ఉండే ఆసియాకు చెందిన యువ దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై ఘర్షణ జరిగింది.
భర్త తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు భార్యతో చెప్పాడు. అది విన్న భార్య ముందు షాక్ అయ్యింది. ఆ తరువాత కోపంతో ఊగిపోయింది. తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు రెండో పెళ్లి అంటున్నాడని భర్తపై attackకి దిగింది. చేతికి అందిన వాటితో భర్తపై దాడి చేసింది. ఆమె చర్యతో షాకైన husband తేరుకుని భార్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఆగలేదు సరికదా.. భర్తను ఇష్టానుసారంగా కొట్టింది. దీంతో భర్త కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఈ క్రమంలో భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య అతడిని బలంగా వెనక్కి నెట్టేసింది. ఆ తోపుకు భర్త వెనక్క విరుచుకు పడ్డాడు. అయితే అతడు కింద పడే సమయంలో నేలకు గట్టిగా తాకాడు. ఆ సమయంలో దెబ్బ తగలకుండా ఉండేందుకు.. కుడిచేతిని నేలకు ఆనించాడు. దీంతో చేతిమీద బలం ఎక్కువ కావడంతో వేళ్లు విరిగిపోయాయి. ఇక భార్యపై భర్త చేసిన దాడిలో ఆమె చేవికి దెబ్బ తగిలింది. దాంతో ఆమెకు వినికిడి సమస్య ఏర్పడింది.
ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా దుబాయ్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా దంపతులిద్దరూ తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరిదీ అంతే తప్పు ఉన్నట్లు నిర్ధారించింది. ఇద్దరికీ చెరో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తయిన వెంటనే దేశం విడిచి పోవాలని తీర్పునిచ్చింది.
