కరోనా నేపథ్యంలో ఆమె అనంతపురం జిల్లా ధర్మవరంలోని శాంతి నగర్ లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. వారి ఇంటటి పక్కనే ఉండే యువకుడు రామాంజనేయులు ఉమాను ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె తన ప్రేమను అంగీకరించేలా చేసుకున్నాడు. చివరకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ.. ఆరు నెలలకే అతనిపై ప్రేమ తగ్గిపోయింది. ఈ క్రమంలో అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మదనపల్లె పట్టణంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి మండలం మంగళం పంచాయతీ బీటీఆర్ పురానికి చెందిన కుమార్ మృతి చెందగా... అతని భార్య నీలమ్మ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. వీరి కుమార్తె ఉమా(18) తన పెద్దమ్మ ఇంట్లో ఉండేది. కరోనా నేపథ్యంలో ఆమె అనంతపురం జిల్లా ధర్మవరంలోని శాంతి నగర్ లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. వారి ఇంటటి పక్కనే ఉండే యువకుడు రామాంజనేయులు ఉమాను ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ధర్మవరంలో ఉండలేక ఉపాధి కోసం మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెలో నాలుగు నెలల క్రితం భార్యను తీసుకువచ్చి.. అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతను చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు అలవాటు పడ్డ రామాంజనేయులు తరచూ భార్యతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో.. ఇటీవల రామాంజనేయులు భార్యతో గొడవ పడి.. ఉమ మెడకు ఉరివేసి హత్య చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.