నంద్యాల: కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో బుధవారం నాడు దారుణం చోటు చేసుకొంది.దివ్యాంగుడిని పెళ్లి చేసుకొందని చెల్లెలు గొంతుకోశాడు ఆమె సోదరుడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. 

నంద్యాలలోని నూనెపల్లిలో జ్యోతి అనే యువతి దివ్యాంగుడిని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకొంది. ఈ పెళ్లి ఇష్టం లేని జ్యోతి సోదరుడు ఆమెపై బుధవారం నాడు కత్తితో దాడికి  దిగాడు. 

సోదరి గొంతు కోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించడంతో  నిందితుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. దివ్యాంగుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే దాడి చేసినట్టుగా నిందితుడు చెప్పినట్టు సమాచారం.