మేనమరదలిమీద మనసు పడ్డాడో మేనబావ. అదే విషయాన్ని తన మేనమామకు చెప్పాడు. ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేయమన్నాడు. కానీ దానికి అతను ఒప్పుకోలేదు. వరుసైన వాడే అయినా.. అభ్యంతరం చెప్పాడు. దీన్ని అతను తట్టుకోలేకపోయాడు.. దాంతో..
ప్రకాశం : marriage చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామ మీద ఓ మేనల్లుడు knifeతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీఠాపురంలో గురువారం జరిగింది. వివరాలు..ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండి శివ తన uncleను అతని daughterని తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడు. అయితే అలా తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని మామ మారంరెడ్డి నరసింహారెడ్డి చెప్పడంతో మేనల్లుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మామ మీద కత్తితో దాడిచేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమార్తె మీద కూడా అదే కత్తితో చేతిపై కోసి గాయపరిచాడు. క్షతగాత్రులను స్థానికులు ఒంగోలు జీజీహెచ్ కు తరలించారు. ఎస్ఐ సురేష్ కు సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శివను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
కాగా, జనవరి 12న ఇలాంటి ఘటనే కర్నూలులో జరిగింది. తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త మీద కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డు వచ్చిన భార్యనూ గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం
ఆధోనిలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠాగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కొద్దికాలం తర్వాత అతని అసలు స్వరూపం బయటపడింది. నరేష్ కుమార్ మద్యానికి బానిస అని తేలింది. అంతేకాదు నిత్యం తాగి వచ్చి భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. ఇది భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోపంతో.. తాగి.. నరేష్ కుమార్ అత్త ఇంటికెళ్లాడు. కోపంతో ఊగిపోతూ knifeతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది.
అడ్డు వచ్చిన భార్య మీద మీద కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్ కుమార్ అక్కడినుంచి తప్పించుకుని పరారయ్యాడు. జరిగిన ఘటన మీద మాధవి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే నరేష్ కుమార్ మీద భార్య ఆరోపిస్తూ.. నరేష్ తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాక వివాహ సమయంలో తమ దగ్గర రూ.8 లక్షలు నగదు, 20 తులాల బంగారం కట్నంగా తీసుకున్నారని తెలిపింది. ఆ మొత్తాన్ని నరేష్ తాగుడుకు ఖర్చు చేసేశాడని... మళ్లీ ఇప్పుడు డబ్బు కోసం రోజూ వేధిస్తున్నాడని మాధవి విలపించింది.
