తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కట్టుకున్న భార్యను పథకం ప్రకారం హతమార్చాడో భర్త. మంగళవారం గుంటూరులో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు : భార్యకు బలవంతంగా పురుగుల మందు తాగించి భర్త హతమార్చిన ఘటన guntur జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువులో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పర్చూరు మండలం తన్నీరువారిపాలేనికి చెందిన శ్రీలక్ష్మికి(35) గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలేనికి చెందిన చలంచర్ల ప్రసాద్ తో 13 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు.
ప్రసాద్ ఏడాది క్రితం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, గిద్దలూరుకు మకాం మార్చాడు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం శ్రీలక్ష్మిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని, వెల్లాలచెరువు పొలాల్లోకి తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ లో పురుగులమందు కలిపి బలవంతంగా ఆమెకు తాగించాడు. ఆమె పురుగుల మందు తాగినట్లు బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం మొదట నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం గుంటూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ రాజేష్, ఎస్సై పరిశీలించారు. ఘటనా స్థలంలో పడి ఉన్నకూల్ డ్రింక్ ఖాళీ డబ్బా ను, పురుగు మందు డబ్బాను ఆధారాలుగా స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
ఇదిలా ఉండగా,
Abdullapurmet జంట హత్య కేసులో పోలీసులు విచారణ జరిపారు. క్యాబ్ డ్రైవర్ యశ్వంత్, జ్యోతికి Extramarital affair ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధమే Murderకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులను ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. యశ్వంత్ మర్మాంగాన్ని హంతకులు ఛిద్రం చేశారు. జ్యోతి ముఖంపై రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు గాలిస్తున్నారు.
కాగా అబ్దుల్లాపూర్మెట్ లో మృతదేహాల కలకలం రేగింది. కొత్త గూడెం బ్రిడ్జి దగ్గర జంట మృతదేహాలను స్థానికులు గుర్తించారు. మూడు రోజుల క్రితం హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిపోయిన స్థితిలో మహిళ, యువకుడి మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులు కవాడిగూడ వాసులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ దారుణం వెలుగుచూసింది. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో యువతీయువకుల మృతదేహాలు కలకలం రేపాయి. దుర్వాసన వస్తుండడంతో అక్కడికి వెళ్లి చూసిన స్థానికులు డెడ్ బాడీలు కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. యువతీ యువకుల మృతదేహాలు నగ్నంగా పడి ఉండగా, యువతి మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. హత్యచేసి తగలబెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. యువకుడి పేరు యశ్వంత్ గా, యువతి పేరు జ్యోతిగా గుర్తించారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
