Asianet News TeluguAsianet News Telugu

మేనత్తతో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉందని మరదలిని ఊరిబైటికి తీసుకెళ్లి...

మేనత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. కూతురు ఎదుగుతోందని ఆమె అతడిని దూరం పెట్టసాగింది. దీంతో తట్టుకోలేక దారుణానికి ఒడిగట్టాడు. 

man assassinated lover daughter over extramarital affair in east godavari - bsb
Author
First Published Sep 26, 2023, 2:21 PM IST

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ఓ బాలిక హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ బాలికను మేనబావే అత్యంత దారుణంగా హతమార్చాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి తనను తీసుకు వెళ్ళేది ఓ దుర్మార్గుడు అని అనుకోలేక పోయింది. మేక వన్నె పులిలా నిలువెల్లా కపటంతో తనను కబళించడానికి తీసుకెళుతున్నాడని ఊహించలేకపోయింది.  

కుటుంబానికి దగ్గర బంధువైన అతడు చెప్పింది విని.. అమాయకంగా అనుసరించింది. దారుణంగా హత్యకు గురైంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన ద్రోణ వీర్రాజు, జ్యోతి దంపతులు.  ఇటీవల కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో  విడిపోయారు. జ్యోతి  తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానసను తన దగ్గరే ఉంచుకుంది.  

షాకింగ్ : తల్లికి తన రహస్యం తెలిసిపోయిందని.. 30 సార్లు కత్తితో పొడిచి చంపిన కూతురు..

మానస, జ్యోతి తల్లి సునీత, జ్యోతి కలిసి పెద్దాపురం పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బత్తిన నాని జ్యోతికి  దగ్గర బంధువు. నాని రంగంపేట మండలం వడిషలేరుకు చెందిన వాడు. నాని జ్యోతికి వరుసకు మేనల్లుడు అవుతాడు. వీరిద్దరి మధ్య గత ఐదేళ్లుగా సాన్నిహిత్యం ఏర్పడింది.  అయితే ఇటీవల కాలంలో జ్యోతి నానిని కాస్త దూరం పెడుతోంది.  

కూతురు పెరుగుతోందని.. ఈ సమయంలో నాని ఇలా ఇంటికి రావడం వల్ల ఆమె మీద నెగటివ్  ప్రభావం పడుతుందని దూరం పెడుతోంది. దీన్ని నాని తట్టుకోలేకపోయాడు. తమ సంబంధానికి జ్యోతి కూతురు మానస అడ్డుగా ఉందని భావించాడు. ఆమెను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం పక్కా ప్రణాళిక వేశాడు.  ఈ నెల 19వ తేదీన మానసను బయటికి తీసుకువెళ్తానని చెప్పాడు.  సమీప బంధువే కావడంతో చిన్నారి అమాయకంగా నమ్మేసింది.  
అలా నమ్మిన మానసను బైక్ మీద ఎక్కించుకుని స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి నాని తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను హతమార్చాడు. బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మానస ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఈనెల 20వ తేదీన జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు నాని అనుమానితుడిగా కనిపించాడు.  

వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, విచారించాలనుకున్నారు.  అయితే నాని పరారీలో ఉండడంతో… బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల గాలింపులో ఆదివారం రాత్రి బాలిక మృతదేహం కట్టమూరు పుంతలు దొరికింది. బాలిక మృతదేహాన్ని ముందుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు అక్కడ చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడం గమనించారు..  బారికదేహాన్ని కుక్కలు ఈడ్చుకురావడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.  

దుస్తుల ఆధారంగా మాత్రమే ఆది మానస మృతదేహంగా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తరువాత బంధువులకు అప్పగించడంతో సోమవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.  వివాహేతర సంబంధం కోసం మానసను హత్య చేసిన నానిని పట్టుకోవడం కోసం అతడి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. అతనిని పట్టించిన వారికి పదివేల రూపాయల బహుమతి కూడా ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios