మంత్రి అఖిల సంతకం ఫోర్జరీ, కానీ వ్యూహం బెడిసింది

man arrested for forgery of minister Akhila priyas signature
Highlights

  • ఉద్యోగం కోసం మంత్రి అఖిల ప్రియ సంతకం ఫోర్జరీ
  • సిఫార్సు లేఖను అఖిలకే అందించిన దొరికిన దొంగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఒక వ్యక్తి షాకి ఇచ్చాడు.అయితే, తప్పులో కాలేశాడు.  ఆమె  సంతకాన్ని ఫోర్జరీ చేశాడు గాని,  ఆమెకే సిఫారసు లేఖ పంపి దొరికి పోయాడు. మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకునిందితుడిని అమరావతి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేసి సిఫారసు లేఖలను తయారు చేశాడు.
ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేశారు. ఈ సిఫార్సు లేఖను ఎవరికో అందించకుండా ఏకంగా మంత్రి అఖిలకే అందించాడు.

ఈ లేఖను చూసిన మంత్రి అవాక్కయ్యారు. అలీ అనే వ్యక్తికి వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలంటూ మంత్రి అఖిలప్రియ సిఫారసు చేసినట్లు రాసిన లేఖ మంత్రి కార్యాలయానకే  అందింది. ఇదే మిటో అర్థం కాక కొద్ది సేపు సిబ్బంది తికమక పడ్డారు. వెంటనే మంత్రికి లేఖ చూపారు. మంత్రి సంతకం ఫోర్జరీ చేసినట్లు వెల్లడయింది. పేషీ సిబ్బంది వెంటనే ఎస్పీఎఫ్ కి ఫిర్యాదు చేశారు.

తాను ఎవరికీ సిఫారసు లేఖలు ఇవ్వలేదని మంత్రి భూమా అఖిలప్రియ చెబుతున్నారు.కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

loader