హైదరాబాద్‌ : దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాళులర్పించారు. దీదీ తన ట్విటర్‌ వేదికగా   ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె ట్యాగ్‌ చేశారు. 

మరోవైపు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. వైయస్ జన్మిదనాన్ని ఇకపై రైతు దినోత్సవంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.