అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు డబుల్ ప్రమోషన్ లభించినట్లైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్కీగా గెలుపొందిన మల్లాది విష్ణు ఎన్నికల అనంతరం ఆయనకు కీలక పదవులు కట్టబెట్టారు సీఎం జగన్. 

వైయస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డ మల్లాది విష్ణుకు సీఎం జగన్ డబుల్ ప్రమోషన్లు ఇచ్చినట్లు రెండు కీలక పదవులు కట్టబెట్టారు. ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. 

అంతేకాదు అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు అదనంగా రెండు కీలక పదవులు కట్టబెట్టడంతో డబుల్ ప్రమోషన్ దక్కించుకున్నట్లైందని అభిమానులు స్పష్టం చేస్తున్నారు.