విశాఖ జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చేటు చేసుకుంది. జాతీయ రహదారి వంతెనపై నుండి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి బస్సు విశాఖ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

కాగా బస్సులో కేవలం ఐదుగురు ప్రయాణీకులు మాత్రమే ఉండటంతో ఘోర ప్రమాదం తప్పయిపోయింది. ప్రమాదం జరిగిన తరవాత స్థానికులు అక్కడకు చేరుకుని. క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం తోనే ఈ ప్రమాదం సంభవంచి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా... నాతవరం-తాండవ జంక్షన్ రహదారిలో అగ్రహరం సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీ-కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు స్ధానికులు చెబుతున్నారు.