పత్తి గోడౌన్‌లో అగ్నిప్రమాదం: కోట్లాది నష్టం, తప్పిన ముప్పు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 12, Aug 2018, 10:11 AM IST
Major fire in cotton dodown at Guntur
Highlights

గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని వాసవీనగర్‌లో  పత్తి గోడౌన్‌లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయాలు పత్తి బేళ్లు దగ్దమయ్యాయి

గుంటూరు:గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని వాసవీనగర్‌లో  పత్తి గోడౌన్‌లో ఆదివారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ అగ్ని ప్రమాదంలో కోట్లాది రూపాయాలు పత్తి బేళ్లు దగ్దమయ్యాయి.

ఆదివారం తెల్లవారుజాము నుండి  ఈ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  షార్ట్‌ సర్క్యూట్ కారణంగానే పత్తి బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు  గుర్తించారు. 

అయితే గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న విషయాన్ని గుర్తించిన  స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి  గోడౌన్ యజమానికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశాయి.

అయితే  వర్షాలు కురుస్తున్న కారణంగా  ఇతర ప్రాంతాలకు  ఈ మంటలు వ్యాపించలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.అగ్ని మాపక సిబ్బంది కూడ సకాలంలో స్పందించడంతో  మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు. ఈ అగ్ని ప్రమాదం  కారణంగా  సుమారు కోట్లాది రూపాయాల నష్టం వాటిల్లింది. 

loader