అనంతరం జిల్లాలోని తాడిపత్రి పట్టణ సమీపంలోని గరుడ స్టీల్ ఫ్లాంట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఎద్దును తప్పించబోయి తుఫాన్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని తాడిపత్రి మొయిన్ బజార్ కు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా తిరుపతి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.