వైసిపి ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశామంటూ ... తన చెప్పుతో తానే కొట్టుకున్న రైతన్న

తడిసిపోయిన పంటను కల్లంలో ఆరబెట్టుకున్న ఓ రైతు పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి ముందే తన చెప్పుతో కొట్టుకున్నాడు. 

Mailavaram farmer who hit himself with his sandal AKP

మైలవరం : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు తీవ్ర నష్టాలపాలయ్యారు. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామన్న ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదని... దీంతో పంట పూర్తిగా నాశనం అయిపోతోందని రైతులు వాపోతున్నాయి. చివరకు తడిసిన ధాన్యం పరిశీలించేందుకు, నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పేందుకైనా రావడంలేదంటూ అధికార వైసిపి నాయకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ కౌలు రైతు తాము వైసిపి ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేసామంటూ ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యే ముందే చెప్పుతో కొట్టుకున్నాడు. 

తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమం సాగుతోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  మైలవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని దేవినేని ఉమ పరిశీలించారు. 

ఇలా దామలూరు గ్రామంలో ఓ కౌలు రైతు వర్షంలో తడిసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ సమయంలోనే సదరు రైతు షేక్ గాలి సైదా స్థానిక వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు రోడ్డునపడితే ఎమ్మెల్యే వసంత మాత్రం ఏసీ గదుల్లో పడుకుని బయటకురావడం లేదని... కనీసం తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడంలేదని కౌలు రైతు ఆరోపించాడు. ఆయన గెలిపించుకుని మైలవరానికి దరిద్రం కొనితెచ్చుకున్నామంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. 

Read More  ఈ నెల 11న విశాఖ పర్యటన‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి...

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ... వైసిసి ప్రభుత్వం, ఎమ్మెల్యే వసంతపై మండిపడ్డారు. వర్షాలకు పంటలు నష్టపోయిన అన్నదాతలను పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యేకు తీరిక లేదా అంటూ ప్రశ్నించారు. ఇక వైసిపి ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా నిలిచే ఒక్కపనీ చెయ్యడంలేదని... ముఖ్యమంత్రి జగన్ కు రాజకీయాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టదా అని ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్యేను, ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు పశ్చాత్తాపానికి గురవుతున్నారని... కౌలు రైతు సైదా వ్యక్తపర్చిన బాదే అందుకు నిదర్శమని దేవినేని ఉమ అన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios