ఈ నెల 11న విశాఖ పర్యటనకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
Visakhapatnam: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్నారు. పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
CM YS Jagan Mohan Reddy to visit Vizag: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పర్యటించనున్నారు. పీఎం పాలెంలోని క్రికెట్ స్టేడియంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వివరాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3.20 గంటలకు విశాఖ చేరుకుని హెలికాప్టర్ లో పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి వెళ్లి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్టేడియంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం ఆరిలోవలో ఏర్పాటు చేసిన అపోలో కేన్సర్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఫొటో సెషన్ లో పాల్గొని రేడియేషన్ పరికరాల కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తన పర్యటనలో భాగంగా సాయంత్రం ముఖ్యమంత్రి పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
బీచ్ రోడ్డులో సీ హారియర్ మ్యూజియం, రామ్ నగర్ లో వాణిజ్య సముదాయం, ఎంవీపీ కాలనీలో ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. యెండాడలో కాపు భవన్, భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడు సాయి కత్తికేయ వివాహానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి బయలుదేరుతారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది.
ఇదిలావుండగా, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్నకు చెబుదాం అనే యూనివర్సల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ హెల్ప్ లైన్ ను ప్రారంభించనున్నారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా పౌరులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జగనన్నకు చెబుదాం హెల్ప్ లైన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.