అమరావతి: పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సమావేశమయ్యారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం ఉదయం చంద్రబాబును కలిశారు. 

ఇరువురి మధ్య ఏ విధమైన చర్చలు జరిగియానేది తెలియ రావడం లేదు. కానీ చంద్రబాబుతో భేటీ తర్వాత బయటకు వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులకు చేతులు జోడించి నమస్కారం పెడుతూ వెళ్లిపోయారు. 

ప్రకాశం జిల్లాలో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వదిలి వైసిపిలో చేరారు. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో చంద్రబాబు ఆయనను పిలిపించి మాట్లాడారు. 

వైసిపిలో చేరి ఒంగోలు నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలనే ఆలోచనలో మాగుంట ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీన మాగుంట తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.

సంబంధిత వార్త

టీడీపీకి మరోషాక్: వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట..?