ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని కల్లూరు మండలం నెరవాడ వద్ద వక్కెర వాగు దాడులూ మద్దిలేటి అనే వ్యక్తి మృతి చెందాడు. వాగు నుండి మద్దిలేటి మృతదేహన్ని వెలికితీశారు.

కర్నూల్:ఉమ్మడి Kurnool జిల్లాలోని Kalluru మండలం నెరవాడ వద్ద వక్కెర వాగు దాటుతూ మద్దిలేటి అనే వ్యక్తి మృతి చెందాడు. Maddileti మృతదేహన్ని మంగళవారం నాడు మధ్యాహ్నం వెలికి తీశారు. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి Vakkea వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.దీంతో నెరవాడ నుండి కర్నూల్ కు వెళ్లేందుకు ఐదుగురు వ్యక్తులు బయలుదేరారు. ఈ ఐదుగురు వ్యక్తులు వక్కెర వాగుపై నిర్మించిన కాజ్ వే ను జాగ్రత్తగా దాటే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మద్దిలేటి అనే వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

అతడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ వరద ప్రవాహంతో అతను చిక్కలేదు. మద్దిలేటి కోసం గజ ఈతగాళ్లు, స్థానికులు వరద ప్రవాహంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం మద్దిలేటి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. ఇవాళ ఉదయం కురిసిన వర్షం కారణంగా వాగుకు భారీ ఎత్తున వరద పోటెత్తింది. అయితే ఈ కాజ్ వే వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉందని స్థానికులు వారించారు. అయితే ఐదుగురు వ్యక్తులు చేతులు పట్టుకొని కాజ్ వేను దాటేప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతికి మద్దిలేటి పట్టుతప్పి వాగు నీటిలో కొట్టకుపోయాడు.