MP Balashowry : మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వల్లభనేని వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు . వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వేరొకరిని పోటీకి దింపాలని వైఎస్సార్‌సీపీ హైకమాండ్‌ ప్రయత్నిస్తోందన్న వార్తలు రావడంతో బాలసౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

MP Balashowry : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రవత్తరంగా మారుతోంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే.. ఏపీలో రాజకీయ సందడి జోరందుకుంది. రాజకీయ సమీకరణలు, పార్టీ ఫిరాయింపులు, పొత్తుల కోలాహలం, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారు, ప్రకటించిన అభ్యర్థుల ప్రచారంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార పక్షం వైసీపీకి షాక్ ఇచ్చాడు.

తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వల్లభనేని పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో గత కొంతకాలంగా బాలశౌరికి పడటం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం ద్రుష్టికి పేర్ని నానికి అండగా నిలిచింది.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బాలశౌరి మళ్లీ మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని భావించినా ఆయనకు టిక్కెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరందుకుంది. అదేసమయంలో వంగవీటి రాధాను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీకి పోటీకి దింపాలని యోచనలో ఉందని తెలియడంతో బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఆయన కుమారుడికి అవనిగడ్డ సీటు కూడా ఇవ్వడం లేదని తేలడంతో ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారని టాక్.