Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

మాచర్ల : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోటీ వుంటుంది... ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందినవారే బరిలోకి దిగుతుండటంతో  మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసిపి మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది. 

Macherla assembly elections result 2024 AKP
Author
First Published Mar 8, 2024, 4:45 PM IST

మాచర్ల రాజకీయాలు : 

మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు చాలా భిన్నంగా వున్నాయి. ఇక్కడి ప్రజలు చాలాకాలంగా ఒకే కుటుంబానికి ఎమ్మెల్యే పదవిని కట్టబెడుతున్నారు. 2004 లో పిన్నెల్లి కుటుంబం చేతికిచిక్కిన ఈ నియోజకవర్గం ఇప్పటికీ   కొనసాగుతోంది.  2004 పిన్నెల్లి లక్ష్మారెడ్డి,  ఆ తర్వాత ఆయన తమ్ముడి కుమారుడు పిన్నెల్లి రామకృష్ఱారెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వరుసగా నాలుగుసార్లు ( రెండుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు వైసిపి) నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఇక జూలకంటి కుటుంబానికి కూడా మాచర్ల రాజకీయాలపై మంచి పట్టు వుంది. 1972 లో జూలకంటి నాగిరెడ్డి స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1999 లో జూలకంటి దుర్గాంబ (నాగిరెడ్డి భార్య) టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరి కొడుకే జూలకంటి బ్రహ్మానందరెడ్డి... ఈయన ఈసారి టిడిపి తరపున బరిలోకి దిగుతూ పిన్నెల్లితో ఢీకొంటున్నాడు.  


మాచర్ల అసెంబ్లీ పరిధిలోని మండలాలు : 

మాచర్ల 
వెల్దుర్తి 
దుర్గి 
రెంటచింతల
కారెంపూడి 

మాచర్ల అసెంబ్లీ ఓటర్లు : 

మాచర్ల నియోజకవర్గ ఓటర్లు - 2,50,403 (2019 ఎన్నికల ప్రకారం) 

మహిళలు ‌‌-‌ 126964

పురుషులు - 123417

మాచర్ల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :

మాచర్ల వైసిపి అభ్యర్థి : 

ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే మరోసారి మాచర్లలో పోటీ చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగుసార్లు మాచర్ల బరిలోనిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదోసారి కూడా ఆయననే బరిలోకి దింపుతోంది వైసిపి. 

మాచర్ల టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల బరిలో దింపుతోంది. ఆయన అయితేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కోగలడని నమ్ముతోంది... అందువల్లే టిడిపి బరిలోకి దింపింది.  గతంలో ఇదే పిన్నెల్లి చేతిలో బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. 

మాచర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

మాచర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

మొత్తం పోలయిన  ఓట్లు 2,12,733 (84 శాతం)

వైసిపి - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - 1,10,406 (52 శాతం) - 21,918 ఓట్ల మెజారిటితో విజయం 

టిడిపి - అన్నపురెడ్డి అంజిరెడ్డి - 88,488 (42 శాతం) - ఓటమి 

మాచర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు 2,38,236 

పోలయిన ఓట్లు 1,93,482 (81 శాతం) 

వైసిపి - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - 94,249 (48 శాతం) - 3,535 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కొమ్మారెడ్డి చలమారెడ్డి - 90,714 ‌(47 శాతం) ‌- ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios