Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే రిపోర్టు జారీ చేసింది.
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మే నెలలోనే వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే రిపోర్టు జారీ చేసింది. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో మే 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మే 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుందని అంచనా వేసింది. అల్పపీడన ధ్రోణి ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించిందని తెలిపింది. అలాగే ఐఎండీ నివేదిక ప్రకారం దక్షిణ తమిళనాడుతో సహా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగనుందంది. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
19 వ తేదీన చిత్తూరు,తిరుపతి(D), వైఎస్ఆర్, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది.
అలాగే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం అనకాపల్లి,కాకినాడ, శ్రీకాకుళం, కృష్ణా,నెల్లూరు, అల్లూరి,మన్యం, ఉభయగోదావరి, కోనసీమ,ఏలూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
