రెండు రోజుల తర్వాత తోటపల్లి రిజర్వాయర్ స్పిల్ వే సమీపంలో ప్రేమికుల జంట రాకేష్, గాయత్రిల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

విజయనగరం: రెండు రోజుల తర్వాత తోటపల్లి రిజర్వాయర్ స్పిల్ వే సమీపంలో ప్రేమికుల జంట రాకేష్, గాయత్రిల మృతదేహాలు లభ్యమయ్యాయి.ఆత్మహత్య చేసుకొంటామని రాకేష్, గాయత్రిలు సెల్పీ వీడియోను తీసుకొని స్నేహితులకు పంపారు. ఈ విషయాన్ని రాకేష్ స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తోటపల్లి రిజర్వాయర్ వద్దకు చేరుకొనేసరికి రాకేష్ బైక్ ను గుర్తించారు. ఈ నెల 28వ తేదీ నుండి తోటపల్లి రిజర్వాయర్ వద్ద వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ స్పిల్ వే సమీపంలో మృతదేహాలను గుర్తించారు. స్పిల్ వేకు 200 మీటర్ల దూరంలో వీరి మృతదేహాలను బుధవారం నాడు గుర్తించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read: ఆత్మహత్య చేసుకొంటామని లవర్స్ సెల్పీ వీడియో: తోటపల్లి బ్యారేజీలో గాలింపు...

బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాం ప్రాంతానికి చెందిన గాయత్రిలు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి ప్రేమకు పెద్దల నుండి అమనుతి లేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. రెండు రోజుల క్రితం తోటపల్లి రిజర్వాయర్ లో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు.ఒకరినొకరు తమ నడుములకు చున్నీని చుట్టుకొని తోటపల్లి రిజర్వాయర్ లో దూకి చనిపోయారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు.