ఆత్మహత్య చేసుకొంటామని లవర్స్ సెల్పీ వీడియో: తోటపల్లి బ్యారేజీలో గాలింపు
తమ ప్రేమకు పెద్దల నుండి అంగీకరించడం లేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియోను స్నేహితులకు పంపారు.
విజయనగరం: తమ ప్రేమకు పెద్దల నుండి అంగీకరించడం లేదని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియోను స్నేహితులకు పంపారు.బొబ్బిలికి చెందిన రాకేష్, కురుపాం ప్రాంతానికి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ ప్రేమకు అమ్మాయి తరపు బంధువుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో తాము ఆత్మహత్య చేసుకొంటామని ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంటామని సెల్పీ వీడియో తీశారు. తోటపల్లి బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసకొంటామని ప్రకటించారు. ఈ వీడియోను స్నేహితులకు పంపారు. స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తోటపల్లి బ్యారేజీ వద్ద రాకేష్ ఉపయోగించే బైక్ ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ బ్యారేజీలో గాలింపు చర్యలు చేపట్టారు.