విశాఖలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కైలాసగిరి వద్దకు చేరుకున్న సత్యనారాయణ, కమల అనే ప్రేమికులు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును బాదంపాలులో కలుపుకుని ఆత్మహత్యకు యత్నించారు.

ఈ క్రమంలో సత్యనారాయణ అక్కడికక్కడే మరణించగా... కమల పరిస్ధితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరిని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం ఆడారు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.