ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరులో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన మంగళవారం నాడు ఉదయం చోటు చేసుకొంంది.ఒంగోలుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి,  అదే పట్టణంలోని  వెంకటేశ్వరస్వామి కాలనీకి చెందిన ఇందు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు.

విషయం తెలుసుకొన్న రైల్వే పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.