నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు శివారులో గల పడారుపల్లి లాడ్జిలో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని హరీష్, లావన్యలుగా గుర్తించారు. ఒకే తాడుకు ఉరి వేసుకుని వారు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని భావిస్తున్నారు. 

నెల్లూరు జిల్లా రూరల్ మండలానికి చెందిన హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. నాయుడుపేటకు చెందిన లావణ్ అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తోంది. వారిద్దరు కూడా శుక్రవారం విధులకు హాజరు కాలేదు. 

నెల్లూరు నగర శివారులో గల నందా లాడ్జిలో వారు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వారిద్దరు ఆ గదిలో ఒకే తాడుకు ఉరేసుకుని మరణించారు రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో హరీష్, లావణ్యల కుటుబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చిది. ఈ ఘటనపై అర్థరాత్రి దాటే వరకు కూడా పోలీసులకు ఏ విధమైన సమాచారం లేదు. 

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కొడవలూరులో హరికృష్ణ అనే వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు.