వెంకటాపురం: వారిద్దరూ బంధువులు... ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈ ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరు వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారని పెద్దల ద్వారా తెలుసుకున్నారు. దీంతో కలిసి బ్రతకలేకమని... అలాగని విడిపోయి బ్రతకలేయని భావించిన ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన ఇద్దరూ పొలాల్లో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఈ విషాద సంఘటకు  సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు(22) అదే గ్రామంలోని బంధువుల అమ్మాయిని ప్రేమించుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక(15)తో  యువకుడి ప్రేమాయణం సాఫీగా సాగింది. అయితే వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసింది. దీంతో ఇద్దరు వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారని... ఇలా చేయడం తప్పంటే ప్రేమజంటను మందలించారు. 

దీంతో కలిసి బ్రతకలేమని బ్రతకలేమని భావించిన ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చి కలుసుకున్న వీరిద్దరు ఊరిబయటకు వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. ఆదివారం పశువుల కాపరులు యువకుడు, బాలిక మృతదేహాలను చూసి ఊళ్లోవారికి సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.