తిరుపతి: తిరుమలలో శ్రీవారి నగలు మాయమయ్యాయి. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి నగలను ట్రెజరీలో భద్రపరుస్తారు. ట్రెజరీలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. శ్రీవారికి చెందిన రెండు బంగారు ఉంగరాలు,   ఐదు కిలోల వెండి మాయమైంది.

ఈ ఘటనకు బాధ్యుడుగా టీటీడీ ఏఈఓ శ్రీనివాసులును గుర్తించారు. ఆయనపై చర్యలు తీసుకొన్నారు.ఈ బంగారు,వెండి ఆభరణాలు మాయం కావడంపై  ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

అయితే ప్రతి నెల టీటీడీ ఏఈఓ శ్రీనివాసులు వేతనం నుండి ఈ ఆభరణాలకు సంబంధించిన సొమ్మును రికవరీ చేస్తున్నారు. ఈ  ఆభరణాలకు  సంబంధించి ప్రతి నెల రూ. 30 వేలను ఏఈఓ శ్రీనివాసులు జీతం నుండి రివకరీ చేస్తున్నట్టుగా సమాచారం.

ట్రెజరీలో భద్రపర్చిన ఆభరణాలు మాయమైన ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోకుండా జీతం నుండి నగదును రికవరీ చేయడాన్ని కొందరు భక్తులు తప్పుబడుతున్నారు.