Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి హత్యలకు కుట్రలు: అచ్చెన్నాయుడు వ్యవహారంపై బాబు

ప్రభుత్వం ఇలా అర్థరాత్రి వేళ అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పడం ఆయన ప్రాణాలతో చెలగాటమాడడమేనని ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

LOP Nara Chandrababu Naidu Slams YS Jagan over Atchannaidu Issue
Author
Amaravathi, First Published Jun 25, 2020, 1:45 PM IST

ఈఎస్ఐ స్కాం లో అరెస్టయి ఆసుపాత్రిలో చికిత్స పొందుతున్న టెక్కలి ఎమ్మెల్యే,టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి విషయంలో నిన్న రాత్రి జరిగిన హై డ్రామా అందరికి తెలిసిందే. ప్రభుత్వం ఇలా అర్థరాత్రి వేళ అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పడం ఆయన ప్రాణాలతో చెలగాటమాడడమేనని ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

"అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం. అసలు అరెస్టుచేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చింది" అని అన్నారు. 

"అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పింది. నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది. 10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి?" అని చంద్రబాబు ప్రశ్నించారు. 

"ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయి" అని చంద్రబాబు ఆక్షేపించారు. 

"ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదు? కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయి." అని చంద్రబాబు  చేసారు. 

"అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. న్యాయపరంగా మేమూ పోరాడతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం" అని చంద్రబాబు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios