లండన్ లో భారతీయ సంతతికి చెందిన తరుణ్ గులాటీ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. ఆయన తనకు మద్ధతు ఇవ్వమని జనసేన పార్టీ అధ్యక్షుడిని అడిగారు. మేయర్ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. ఈ ప్రాంతంలో జనసేన అభిమానులు ఎక్కువగా ఉన్నారని.. అందుకే పవన్ మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. తాను పవన్ ను మద్దతు కోరినట్లు.. ఆయన తన అభ్యర్థనను స్వాగతించినట్లుగా తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీన్ని పవన్ కల్యాణ్ స్వాగతించి, అభినందించినట్లుగా జనసేన పార్టీ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటనలో జనసేన అధికారికంగా లండన్ మేయర్ బరిలో ఉన్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటికి మద్దతు ప్రకటించుతున్నట్లుగా తెలిపింది. లండన్ లోని తెలుగువారు, భారతీయులు, తన అభిమానులు, జనసేన శ్రేణులు గులాటి విజయానికి కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసిన గులాటికి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Scroll to load tweet…